ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైభవంగా తిరుమల మహా పాదయాత్ర...! - దేవరకొండ భానుమూర్తి శర్మ

కడప జిల్లా రాజంపేట మండలం హెచ్. చెర్లపల్లి గ్రామం నుంచి దేవరకొండ భానుమూర్తి శర్మ ఆధ్వర్యంలో 27వ తిరుమల మహా పాదయాత్ర వైభవంగా ప్రారంభమైంది.

tirumala_mahaa padayatra
వైభవంగా ప్రారంభమైన తిరుమల మహాపాదయాత్ర

By

Published : Dec 21, 2019, 12:25 PM IST

వైభవంగా ప్రారంభమైన తిరుమల మహాపాదయాత్ర

జైశ్రీరామ్, హరే రామ-హరే కృష్ణ అనే నినాదాలతో భక్తుల తిరుమల మహా పాదయాత్ర వైభవంగా ప్రారంభమైంది. కడప జిల్లా రాజంపేట మండలం హెచ్.చెర్లపల్లి గ్రామం నుంచి దేవరకొండ భానుమూర్తి శర్మ ఆధ్వర్యంలో 27వ తిరుమల మహా పాదయాత్ర ప్రారంభమైంది. హెచ్.చెర్లపల్లి గ్రామంలోని కోదండరామస్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడినుంచి గ్రామీణ ప్రాంతాల మీదుగా పాదయాత్ర రాజంపేట పట్టణానికి చేరుకుంది. చిన్నారుల కోలాటం, పద్యాలతో పాదయాత్ర భక్తిపారవశ్యంతో సాగింది. గ్రామీణ ప్రాంతాల్లో అడుగడుగున పాదయాత్ర బృందానికి భక్తులు ఘన స్వాగతం పలికారు. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని, పాడిపంటలతో వర్ధిల్లాలనే సంకల్పంతో.. గత 27 ఏళ్లుగా అన్నమయ్య నడయాడిన కాలిబాటలో తిరుమలకు పాదయాత్ర చేస్తున్నట్లు భానుమూర్తి శర్మ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details