రాష్ట్ర విభజన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు వజ్ర, వైఢూర్యాలతో పొదిగిన బంగారు పళ్లెంను అందించిందని.. రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు అటు చంద్రబాబు.. ఇటు జగన్ బంగారు పళ్లెంలో అందించిన వాటిని ఒలకబోసి.. రాష్ట్రాన్ని నాశనం చేశారని ధ్వజమెత్తారు.
రాష్ట్రాన్ని చంద్రబాబు, జగన్ నాశనం చేశారు: తులసిరెడ్డి - తులసీ రెడ్డి న్యూస్
మూడు మాస్కులు ఇవ్వలేని సీఎం.. జీతాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు నిర్మిస్తాడట అని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు, జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు. తెదేపా, వైకాపా కొట్లాడుకుంటుంటే మోసగాళ్ల పార్టీ అయిన భాజపా తమాషా చూస్తుందంటూ ధ్వజమెత్తారు.
అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అంతర్జాతీయ రాజధాని నిర్మిస్తానని అరచేతిలో వైకుంఠం చూపించారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్ మూడు మాస్కులు ఇవ్వలేడు కానీ.. మూడు రాజధానులు నిర్మిస్తాడట అని వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు కానీ.. 3 రాజధానులు నిర్మిస్తారంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మోసగాళ్ల పార్టీ అయిన భాజపా.. తెదేపా, వైకాపా కొట్లాడుకుంటుంటే తమాషా చూస్తోందని ఆరోపించారు. ధర్మో రక్షతి రక్షితః.. వృక్షో రక్షతి రక్షితః రాష్ట్ర కాంగ్రెస్ రక్షతి రక్షితః అని తులసిరెడ్డి అన్నారు.
ఇదీ చదవండి:రిమ్స్ లో నాలుగో రోజుకు చేరిన జుడాల సమ్మె