కడప జిల్లా ఎర్రగుంట్ల నగరపంచాయతీ రాణివనానికి చెందిన ఏడుగురు యువకులు సరదాగా కదిరేవారి పల్లె రైల్వే గేటు దగ్గర ఉన్న నాపరాయి గనిలో చేపల వేటకు వెళ్లారు. మొదట సయ్యద్ (10) అనే బాలుడు ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడ్డాడు. అతడిని కాపాడటానికి ప్రయత్నించి మరో ఇద్దరు యువకులు సైతం ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు.
చనిపోయిన యువకుల్లో కృష్ణ చైతన్య (18) ఇంటర్మీడియట్ విద్యార్థి, కమల్ బాషా (19) ఐటిఐ చదువుకొని జీవన ఉపాధి కోసం ఆటో నడిపాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బంది సాయంతో యువకుల మృతదేహాలను వెలికితీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎర్రగుంట్ల సీఐ సదాశివయ్య తెలిపారు.