కడప జిల్లా బద్వేలు మండలం శంకరాపురం గ్రామంలో విషాదం నెలకొంది. ఓ ఇంట్లో బాత్రూమ్ నిర్మాణం కోసం తీయించిన గుంత.. మూడేళ్ల బాలుడి ప్రాణాన్ని బలిగొంది. మదన్ అనే బాలుడు ఆడుకుంటూ వెళ్లి ఆ గుంతల్లో పడి ప్రాణాలు కోల్పోయాడు. అప్పటివరకు కళ్ల ముందే ఆడుకున్న మదన్ మృతితో.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనలో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
బాత్రూమ్ నిర్మాణం కోసం తీసిన గుంతలో పడి బాలుడి మృతి - కడప జిల్లా తాజా వార్తలు
అప్పటివరకు ఆడుకుంటున్న ఆ మూడేళ్ల బాలుడు.. బాత్రూమ్ నిర్మాణం కోసం తీయించిన గుంతలో పడి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన కడప జిల్లా శంకరాపురంలో జరిగింది. తమ కుమారుడి ఆకస్మిక మృతితో.. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
బాత్రూమ్ నిర్మాణం కోసం తీసిన గుంతలో పడి బాలుడి మృతి