కడప శివారులోని బుడ్డాయిపల్లెలో విషాదం నెలకొంది. చెరువులో పడి ముగ్గురు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. పట్టణంలోని కడపసాగర్కి చెందిన గౌస్పీర్, ఖాజా, మౌలా అనే ముగ్గురు చిన్నారులు సరదాగా ఆడుకునేందుకు చెరువులోకి వెళ్లి మృత్యుఒడిలోకి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
చిన్నారుల సరదా.. చెరువులో మునిగి ముగ్గురు దుర్మరణం - చెరువులో మునిగి ముగ్గురు చిన్నారులు దుర్మరణం
చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన విషాదకర ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముగ్గురు చిన్నారులు దుర్మరణం