కడప జిల్లాలోని గండికోట జలాశయంలో నీటి నిల్వ పెరుగుతూ గ్రామాలను వెనుక జలాలు ముంచెత్తుతున్నాయి. కొండాపురం, తాళ్ల ప్రొద్దుటూరు గ్రామాల పరిధిలోని కాలనీలను నీళ్లు చుట్టుముట్టాయి. ఇంటి నుంచి బయటకు అడుగేసే వీల్లేక అవస్థలు పడుతున్న ప్రజలను... విషసర్పాల బెడద ఆందోళనకు గురిచేస్తోంది.
ఇళ్లలోకి కొట్టుకొస్తున్న పాముల వల్ల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని ముంపు బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వం తమకు పరిహారం చెల్లించి పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తే ఇళ్లు ఖాళీ చేసి వెళ్తామని వేడుకుంటున్నారు.