కడప జిల్లా రాజంపేట మండలంలోని కొల్లవారిపల్లె, మిట్టమీదపల్లె, మేకవారి పల్లె, సింగనవారిపల్లె రైతులకు అన్నమయ్య ప్రధాన కాలువ ఆధారం. అన్నమయ్య జలాశయం నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేశారు అధికారులు. అయితే ఆ నీటిని కొందరు రైతులు మెుదటి భాగంలోని ప్రధాన కాలువకు అడ్డుకట్టవేసి తమ ప్రాంతంలోని చెరువుకు నీటిని మళ్లించటంతో... చివరి ఆయకట్టు రైతులకు నీరు అందలేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. అన్నమయ్య జలాశయ అధికారుల పర్యవేక్షణ కరవైందని, ప్రధాన కాలువ నీటిని పక్కకు మళ్ళించుకుంటున్నా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని చివరి ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే వేసిన పంటలు చేతికందే పరిస్థితి ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అక్కరకు రాని అన్నమయ్య ప్రధాన కాలువ! - The water from the last canal of the Annamayya main canal
ఆ కాలువకు నీళ్లు వస్తే సాగునీటికి ఎటువంటి ఇబ్బంది ఉండదని ప్రజలంతా ఆశించారు. నీటిని విడుదల చేయాలని అధికారులకు మెురపెట్టుకున్నారు. చివరకు నీరు విడుదలైనా సమస్యలు తీరలేదు. ఆ జలాలు చివరి ఆయకట్టు వరకు రావడంలేదు.
అన్నమయ్య ప్రధాన కాలువ చివరి ఆయకట్టుకు అందని నీళ్లు
TAGGED:
అన్నమయ్య జలాశయం