కడప జిల్లా రైల్వే కోడూరు మండల పరిధిలోని రాజనగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు, మినీ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రక్కు ఎగిరి... వెనుక భాగం గాల్లోనే ఉండి పోయింది. మరో వైపు ట్రక్కు ముందు భాగంలో డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కు పోయాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వటంతో... వారు ఎంతో చాకచక్యంతో అతన్ని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో కారులో వెళ్తున్న నలుగురితోపాటు... ట్రక్కు లో ఉన్న ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
కారు, మినీ ట్రక్కు ఢీ... క్యాబిన్లో ఇర్కుకున్న డ్రైవర్... - railway Koduru road accidents
వేగంగా వెళ్తున్న కారు, మినీ ట్రక్కును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. మినీ ట్రక్కు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కున్నాడు. అతన్ని అతి కష్టమ్మీద బయటకు తీశారు.
కారు, మినీ ట్రక్కును ఢీకొట్టింది
Last Updated : Nov 19, 2020, 5:19 PM IST