కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా కడప జిల్లా మైదుకూరు పోలీసులు చర్యలను ముమ్మరం చేశారు. కూరగాయలు, కిరాణాలు, మందుల దుకాణాలు, ఆసుపత్రులు మినహా మిగిలిన అన్నింటినీ మూసివేయించారు. ప్రజలు గుంపులుగా లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. బళ్లారి-కృష్ణపట్నం రహదారిపై రాకపోకలు నిలిపి వేశారు. వందలాది వాహనాలు ఆగిపోయాయి.
కరోనా వ్యాప్తి నిరోధక చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు - అవగాహన
కడప జిల్లా మైదుకూరులో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు ముమ్మరం చేశారు. పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పట్టణమంతా వాహనంపై తిరుగుతూ... ఇళ్లకే పరిమితం కావాలని సూచిస్తున్నారు.
కరోనా వ్యాప్తి పై నిరోధక చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు