కడప శివారులో వాటర్ గండి సమీపంలోని పెన్నానది నీటి ప్రవాహంలో పడి 11 ఏళ్ల బాలిక మృతి చెందింది. కడపకు చెందిన మహబూబ్ బాషా తన కుటుంబ సభ్యులతో కలసి ఆదివారం వాటర్ గండికి విహార యాత్రకు బయలుదేరారు. అతడి కుమార్తె సాధికా నీటిని చూసేందుకు పెన్నానదిలోకి వెళ్లగా ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నీటిలో కొట్టుకుపోయింది. తల్లిదండ్రుల ఎదుటే తమ బిడ్డ నీటిలో కొట్టుకొని పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు రెండు రోజుల తరువాత మృత దేహాన్ని వెలికి తీశారు.
పెన్నానదిలో కొట్టుకుపోయిన బాలిక మృతదేహం లభ్యం
తల్లితండ్రులతో కలిసి ఓ బాలిక సరాదాగా గడిపేందుకు వాటర్ గండికి వెళ్లి ప్రమాదవశాత్తు పెన్నానదిలో పడి చనిపోయింది. ఈ ఘటన కడప జిల్లా గండి సమీపంలో జరిగింది. నిమిషాల వ్యవధిలోనే తమ కూతురు నీటిలో కొట్టుకుపోతుంటే ఆ తల్లిదండ్రులు ఏమి చేయలేని నిస్సహయ స్థితిలో ఉండిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటికి తీసుకువచ్చారు.
పెన్నానదిలో కొట్టుకుపోయిన బాలిక మృతదేహం లభ్యం