కడప జిల్లా వేంపల్లి మండలం ఇడుపులపాయలో రెండు రోజులుగా ఎలుగుబంటి సంచారం ఆందోళన కలిగిస్తుంది. ఐఐఐటీకి సెలవులు కావడం వల్ల జన సంచారం తగ్గిపోయింది. దీంతో ఎలుగుబంటి గ్రామంలోకే వచ్చేస్తోంది. చుట్టూ కొండ ప్రాంతం కావడంతో ఇడుపులపాయ, వీరన్నగట్టుపల్లి గ్రామ రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వేసవితాపం తాళలేక నీటికోసం ఇక్కడికి వచ్చి ఉంటుందని చెబుతున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఊరిపైకి భల్లూకం.. భయం గుప్పెట్లో గ్రామస్థులు - కడపలో ఐఐఐ
కరోనాతో ఇప్పటికే నానా తంటాలు పడుతున్నాం. జన జీవనం అక్కడే స్తంభించిపోయింది. ఇదే అదును అదును అనుకుందో ఏమో ఆ భల్లూకం ఊరిపైకి వాకింగ్‌కు వచ్చిపోతుంది. దీంతో అక్కడి ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయం గుప్పేట్లో బతుకుతున్నారు.
ఇడుపులపాయలో ఎలుగుబంటి సంచారం