కడప జిల్లా బద్వేలులో తెలుగుదేశం, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ ఆవరణలో నిర్వహించిన గ్రామసభకు ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఉపాధి హామీ పనుల బిల్లులకు సంబంధించి... తెలుగుదేశం నేత మల్లికార్జునరెడ్డి ఫిర్యాదు చేయడంపై వైకాపా నేత జయరాంరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ఇరువర్గాల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. సభలోని ప్లాస్టిక్ కుర్చీలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. గ్రామసభకు ఆటంకం కలిగించారనే కారణంతో ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బద్వేలు గ్రామసభలో వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ - tdp nycp leaders fifghting in dadwelu
కడప జిల్లా బద్వేలులో జరిగిన ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ గ్రామ సభలో ఉద్రిక్తత నెలకొంది. ఓ బిల్లుకు సంబంధించి తెదేపా..వైకాపా వర్గీయులు ఘర్షణ పడ్డారు. కుర్చీలు ఒకరిపై ఒకరు విసురుకున్నారు.
బద్వేలు గ్రామ సభలో ఎలా పోట్లాడుకున్నారో చూడండి...!