కడప జిల్లా మైదుకూరు, బద్వేలు ఎమ్మెల్యేలు శనివారం తెలుగుగంగ ప్రాజెక్టులో భాగమైన రెండో ఉపజలాశయాన్ని పరిశీలించారు. కాల్వలో నీటి ప్రవాహాన్ని గమనించారు. జిల్లాలోని బ్రహ్మంసాగర్ జలాశయానికి తక్కువ కాలంలో ఎక్కువ నీరు నింపేలా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మాట్లాడారు. రెండో ఉపజలాశయం వద్ద 1200 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా 900 క్యూసెక్కులు మాత్రమే బ్రహ్మంసాగర్‌లోకి వస్తుందని... మిగిలిన నీరు ఎక్కడ వృథా అవుతుందనే విషయంపై చర్చించారు. కాల్వ వెంట పూర్తి స్థాయిలో లీకేజీలను నివారించి బ్రహ్మంసాగర్‌లోకి నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని ప్రజా ప్రతినిధులు అధికారులను కోరారు.
తెలుగుగంగలో భాగమైన రెండో జలాశయాన్ని సందర్శించిన ఎమ్మెల్యేలు
తెలుగుగంగలో అంతర్భాగమైన రెండో ఉపజలాశయాన్ని మైదుకూరు, బద్వేలు ఎమ్మెల్యేలు శనివారం సందర్శించారు.
తెలుగుగంగలో భాగమైన రెండో జలాశయాన్ని సందర్శించిన ఎమ్మెల్యేలు