కడప జిల్లా రాజంపేట విద్యాశాఖ కార్యాలయ ఆవరణంలో ఎస్టీయు నాయకులతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం కనీసం 3 వేల కోట్ల రూపాయలను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యూటీ డీఈవో పోస్టులను భర్తీ చేసి విద్యారంగాన్ని పటిష్టం చేయాలని కోరారు. 2018 డీఎస్సీనీ వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు కొరత ఏర్పడిందన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా ఇంకా పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు, సమ దుస్తులు అందలేదని తెలిపారు.
'2018 డీఎస్సీ నియామకాలు తక్షణమే చేపట్టండి' - 2018 dsc
ఒక నిర్దిష్ట సమయంలోపు సీపీఎస్ రద్దు చేసేందకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి కోరారు. 2018 డీఎస్సీ నీ తక్షణమే అమలు చేసి విద్యారంగాన్ని పటిష్టం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
'2018 డీఎస్సీ నీ తక్షణమే అమలు చెయ్యండి'