'మైదుకూరు మనదే' - పుట్టా సుధాకర్ యాదవ్
ఈసారి మైదకూరులో తెదేపా జెండా ఎగరడం ఖాయమని తితిదే ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ వ్యాాఖ్యానించారు. బీసీలకు తెలుగుదేశం ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తుందన్నారు.
కడపలో తితిదే సహకారంతో నిర్మించిన కల్యాణమండపం, వసతిగృహాన్ని ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రారంభించారు. గత ఐదేళ్లలో మైదకూరు నియోజకవర్గంలో రూ.1000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని సుధాకర్ యాదవ్ తెలిపారు. ఎంత మంది పోటీలో ఉన్నా...ఈసారి మైదకూరులో తెదేపా జెండా ఎగరడం ఖాయమన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు చూసి ప్రజలంతా తెలుగుదేశం వైపే ఉన్నారని స్పష్టం చేశారు. చంద్రబాబు బీసీలకు అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పిస్తున్నారని కొనియాడారు. బీసీలకు తితిదే ఛైర్మన్ పదవి అప్పగించిన ఘనత తెదేపాకే చెందుతుందని సుధాకర్ యాదవ్ వ్యాఖ్యానించారు.