కడప జిల్లా జమ్మలమడుగులో హత్యకు గురైన మాజీ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గురుప్రతాప్ రెడ్డి హత్యపై వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు... తెదేపా నిజనిర్థరణ కమిటీ శుక్రవారం జమ్మలమడుగులో పర్యటించనుంది. గండికోట జలాశయం ముంపు నిర్వాసితులకు పరిహారం చెల్లింపుల్లో భాగంగా... జరిగిన అవకతవకలు బయటపెట్టినందుకే గురుప్రతాప్ రెడ్డిని హత్య చేశారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కమిటీలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎన్.అమరనాథ్ రెడ్డి, కే.ఈ. ప్రభాకర్, మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, మల్లెల లింగారెడ్డి సభ్యులుగా ఉన్నారు.
రేపు జమ్మలమడుగులో తెదేపా నిజనిర్థరణ కమిటీ పర్యటన - tdp committee tour in kadapa district
కడప జిల్లా జమ్మలమడుగులో మాజీ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ హత్యపై తెదేపా నిజనిర్థరణ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ శుక్రవారం జమ్మలమడుగులో పర్యటించనుంది.
రేపు జమ్మలమడుగులో తెదేపా నిజనిర్థరణ కమిటీ పర్యటన