ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 29, 2020, 1:46 PM IST

ETV Bharat / state

'ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటంలో.. ప్రభుత్వం విఫలమైంది'

తుపాను వస్తుంది అని తెలిసి కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని తేదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు విమర్శించారు. అన్నమయ్య జలాశయాన్ని తేదేపా శ్రేణులతో కలిసి పరిశీలించిన ఆయన జలాశయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

Tdp state chief secretary Batyala Chengalrayudu
తేదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు

నిండుకుండలాంటి అన్నమయ్య జలాశయం ఖాళీ కావడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని తేదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు విమర్శించారు. అన్నమయ్య జలాశయాన్ని ఆయన తేదేపా శ్రేణులతో కలిసి పరిశీలించారు. అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. రైతులకు అన్యాయం జరిగిందంటూ నినాదాలు చేశారు.

కడప జిల్లా రాజంపేట మండలం బాదనగడ్డపై నిర్మించిన అన్నమయ్య జలాశయం గేట్లు తెరిచి దిగువకు నీళ్ళు వదిలిన అధికారులు.. తిరిగి గేట్లను కిందికి దించడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎంతో విలువైన జలం వృధాగా సముద్రం పాలైందన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏరియల్ సర్వేతో రైతులకు ఒరిగేదేమీ లేదని.. ఇప్పటికైనా అన్నమయ్య ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టి నీటిని నిల్వ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details