కడప జిల్లా రాయచోటి తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెదేపా నిరసన చేపట్టింది. కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు పరిహారంగా ఇవ్వాలని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసరెడ్డి.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొవిడ్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. తెల్లరేషన్ కార్డు కుటుంబాలకు రూ.10 వేలు ఆర్థిక సాయం చేయాలన్నారు. బ్లాక్ ఫంగస్ మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతుండడం వల్లే.. ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు.
'కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారమివ్వాలి' - rayachoti mro office news
కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారమివ్వాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంపై కడప జిల్లా రాయచోటి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
tdp protest at rajachoti mro office in kadapa
అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. కొవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందించిన వైద్యాధికారులను ఆసుపత్రికి వెళ్లి ఘనంగా సత్కరించారు.
ఇదీ చదవండి:red sandalwood: దుండగులు పరార్... దుంగలు స్వాధీనం