'సీఎం సొంత జిల్లాలో అక్రమ కట్టడాల సంగతేంటి?'
''ప్రజావేదికను కూల్చి ప్రభుత్వం ఏం సాధించింది. ప్రజావేదిక, చంద్రబాబు నివాసం, విశాఖలోని తెదేపా కార్యాలయం తప్ప.. ప్రభుత్వానికి మరే ఇతర అక్రమ కట్టడాలు కనింపిచడం లేదా? ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అక్రమ కట్టడాల సంగతేంటి?'' శ్రీనివాస్ రెడ్డి, కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు
వైకాపా ప్రభుత్వం 40 రోజుల పాలన... కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందని కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులు, విత్తన కొరత, రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేవలం ప్రజావేదిక, చంద్రబాబు నివాసం, విశాఖలో తెదేపా కార్యాలయం కూల్చడమే పనిగా ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నారని ఆయన కడపలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఎన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయో కలెక్టర్ ఆధ్వర్యంలో సర్వే జరిపి లెక్క తేల్చాలని డిమాండ్ చేశారు. లేదంటే తామే అక్రమ కట్టడాల జాబితా విడుదల చేస్తామన్నారు.