ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్​ సొంత నియోజకవర్గంలోనే చెరువులకు గండి కొట్టడం శోచనీయం: బీటెక్​ రవి - టీడీపీ ఎమ్మెల్సీ ​బీటెక్ రవి

TDP MLC RAVI : సీఎం జగన్​ సొంత నియోజకవర్గంలోని చెరువులకు గండ్లు కొట్టడం శోచనీయమని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్​ రవి విమర్శించారు. వేంపల్లె మండలం నాగూరు చెరువుకు గండి కొట్టిన విషయం తెలుసుకొని పార్టీ నాయకులు, గ్రామస్థులతో కలిసి పరిశీలించారు.

TDP MLC BTECH RAVI
TDP MLC BTECH RAVI

By

Published : Dec 20, 2022, 5:16 PM IST

TDP MLC BTECH RAVI : సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన.. ప్రజా వేదిక కూల్చివేతలతోనే ప్రారంభమైందని టీడీపీ ఎమ్మెల్సీ ​బీటెక్ రవి అన్నారు. వేంపల్లె మండలం నాగూరు చెరువుకు గండి కొట్టిన విషయం తెలుసుకొని పార్టీ నాయకులు, గ్రామస్థులతో కలిసి పరిశీలించారు. సీఎం సొంత నియోజకవర్గంలోని చెరువులకు గండ్లు కొట్టడం శోచనీయమన్నారు. నాగూరు, అలవలపాడు చెరువులకు వైసీపీ నాయకులు గండ్లు కొట్టడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.

పార్టీలకు అతీతంగా అలవలపాడు, నాగూరు గ్రామస్థులు ముందుకొచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. 24 గంటల్లో చెరువులకు కొట్టిన గండ్లు పూడ్చకపోతే హైకోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. చెరువుల్లో ఉండే నీరు మొత్తం బయటికిపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. అధికారులకు నాగూరు, అలవలపాడు చెరువులకు గండ్లు కొట్టిన విషయం తెలియదనడం విడ్డూరంగా ఉందన్నారు. చెరువులకు గండ్లు కొట్టిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జగన్​ సొంత నియోజకవర్గంలో చెరువులకు గండ్లు కొట్టడం శోచనీయం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details