ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వివేకా హత్య కేసులో సిట్​ ముందుకు బీటెక్​ రవి - వివేకా హత్య కేసులో సిట్​ విచారణ వార్తలు

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సిట్​ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటోన్న తెదేపా ఎమ్మెల్సీ బీటెక్​ రవి సిట్​ కడపలో పోలీసు శిక్షణా కేంద్రంలో సిట్​ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటు మరో అనుమానితుడు కొమ్మా పరమేశ్వర్​ రెడ్డిని సైతం సిట్​ అధికారులు విచారించారు. తాను పూర్తిగా దర్యాప్తుకు సహకరిస్తానని బీటెక్​ రవి తెలిపారు.

వైఎస్​ వివేకా హత్య కేసులో సిట్​ ముందుకు తెదేపా ఎమ్మెల్సీ బీటెక్​ రవి
వైఎస్​ వివేకా హత్య కేసులో సిట్​ ముందుకు తెదేపా ఎమ్మెల్సీ బీటెక్​ రవి

By

Published : Dec 5, 2019, 12:27 PM IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సిట్ విచారణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు తెదేపాా ఎమ్మెల్సీ బీటెక్​ రవి కడప శివారులోని పోలీసు శిక్షణ కేంద్రంలో సిట్​ ముందు హాజరయ్యారు. వివేకా హత్య కేసులో బీటెక్​ రవిపైనా ఆరోపణలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకూ పోలీసు విచారణకు హాజరుకాలేదు. ఈయనతో పాటు సింహాద్రిపురం మండలం కసనూరుకు చెందిన మరో అనుమానితుడు కొమ్మా పరమేశ్వర్ రెడ్డిని సైతం సిట్ అధికారులు విచారించారు. కొమ్మా పరమేశ్వర్ రెడ్డి బంధువు శ్రీనివాస్ రెడ్డి సెప్టెంబరు 3న ఆత్మహత్య చేసుకున్నాడు. సిట్ అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు శ్రీనివాస్ రెడ్డి లేఖ రాశారు. ఈ ఘటనపై లోతుగా విచారించేందుకు పరమేశ్వర్ రెడ్డిని పిలిచినట్లు తెలుస్తోంది. మార్చి 15న వివేకా హత్య జరిగిన రోజు... ఆరోగ్యం బాగాలేదని పరమేశ్వర్ రెడ్డి తిరుపతి ఆస్పత్రిలో చేరారు. అతనిపై అనుమానంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు... నార్కో అనాలసిస్​ పరీక్షలు నిర్వహించారు. పరమేశ్వర్ రెడ్డి, బీటెక్ రవి ఇద్దరిదీ సింహాద్రిపురం మండలం కసనూరు గ్రామం కావడం విశేషం. విచారణకు పూర్తిగా సహకరిస్తానని బీటెక్ రవి తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details