కడప జిల్లాలో వైకాపా నాయకులు చేస్తున్న అక్రమాలు, భూకబ్జాలకు అడ్డు వస్తున్నారనే కారణంతో తెదేపా నాయకులపై పోలీసులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని తెదేపా కడప పార్లమెంటరీ అధ్యక్షుడు లింగారెడ్డి మండిపడ్డారు. అంతేగాక తీవ్రంగా చితకబాదుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కడప 50వ డివిజన్ తెదేపా ఇన్ఛార్జి వెంకటసుబ్బారెడ్డిని పోలీసులు ఈనెల 8న డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లి రెండు మూడు కేసుల్లో నిందితుడిగా ఒప్పుకోవాలని చితక బాదినట్లు లింగారెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. బాధితుడికి తగిలిన దెబ్బలను చూపించారు. ఈ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.