చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో కాంతులు వెదజల్లగా.. జగన్మోహన్రెడ్డి పాలనలో అంధకారం నెలకొందని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి అన్నారు. పెంచిన విద్యుత్తు బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. కడప జిల్లా ఖాజీపేట మండలం దుంపలగట్టులోని తన నివాసంలో నిరసన దీక్ష చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదేళ్ల కాలంలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏడాదిలో 2 సార్లు పెంచారని విమర్శించారు.
'జగన్ పాలనలో రాష్ట్రంలో అంధకారం నెలకొంది' - తెదేపా నేత రెడ్యం వెంకటసుబ్బారెడ్డి నిరసన
ముఖ్యమంత్రి జగన్ పాలనలో రాష్ట్రంలో అంధకారం నెలకొందని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి విమర్శించారు. పెంచిన విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా పార్జీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలో ఆయన మాట్లాడారు.
దీక్ష చేస్తున్న రెడ్యం వెంకటసుబ్బారెడ్డి