కడప జిల్లా కమలాపురంలో తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీభట్ల సాయినాథ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెదేపా రాష్ట్ర కార్యదర్శిగా తనను నియమించినందుకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, కమలాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ పుట్టా నరసింహరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మంత్రి కొడాలి నాని మాట్లాడే పద్ధతులు మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత మంత్రికి లేదన్న సాయినాథ్.... అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని తెలిపారు.
'మంత్రి కొడాలి నాని అలా మాట్లాడటం సరికాదు' - కడప జిల్లా తాజా వార్తలు
మంత్రి కొడాలి నాని తన వైఖరి మార్చుకోవాలని తెదేపా ప్రధాన కార్యదర్శి కాశీభట్ల సాయినాథ్ హితవు పలికారు. ఈ మేరకు కడప జిల్లా కమలాపురంలో ఆయన సమావేశాన్ని నిర్వహించారు.
మాట్లాడుతున్న తెదేపా నేత కాశీభట్ల సాయినాథ్