దారుణ హత్యకు గురైన తెదేపా నేత నందం సుబ్బయ్య అంత్యక్రియలు కడప జిల్లా ప్రొద్దుటూరులో ముగిశాయి. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు. బాధిత కుటుంబానికి తెలుగుదేశం తరఫున 20 లక్షల రూపాయల సాయాన్ని ప్రకటించారు. సుబ్బయ్య కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
సుబ్బయ్య ఇద్దరి పిల్లలను చదివించే బాధ్యత పార్టీ తీసుకుంటుందని స్పష్టం చేశారు. సుబ్బయ్యను హత్య చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురిపై 15 రోజుల్లోగా కేసు నమోదు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. లేకపోతే రాయలసీమ వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.