ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రహారీ నిర్మాణంపై ఒక్కసారి ఆలోచించండి! - కన్య తీర్థం ఆలయం

కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఉక్కు కర్మాగారానికి కొత్త సమస్య వచ్చి పడింది. కర్మాగారం ఏర్పాటు చేసేందుకు ప్రహారీ నిర్మాణానికి అధికారులు ఆమోదం తెలిపారు. అసలు ప్రహారీకి ఈ సమస్యకు సంబంధం ఏంటంటే...

kanya thirtha temple
కన్య తీర్థం ఆలయం

By

Published : Jun 2, 2020, 2:11 PM IST

కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఉక్కు కర్మాగారానికి కొత్త సమస్య వచ్చిపడింది. ఈ గ్రామంలో పురాతనమైన కన్యతీర్థం ఆలయం ఉంది. ఏపీ హైడ్రోస్టీల్స్ లిమిటెడ్ పేరిట ఈ ఆలయానికి సమీపంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుంది. వారం రోజుల క్రితం అధికారులు పర్యటించి, చుట్టూ ప్రహారీ నిర్మించేందుకు ఆమోదం తెలిపారు.

ఈ ప్రహారీ పరిధిలోనే కన్యతీర్థం ఆలయం ఉండటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఆలయ చరిత్ర, భక్తుల రద్దీ, నిత్య అన్నదానం తదితర విషయాలను ప్రభుత్వం ఆలోచించి ఆలయానికి వెలుపల నుంచి ప్రహారీను ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

  • ఆలయ ప్రాశస్త్యం

కన్యతీర్థం ఆలయాన్ని సప్తమాతృకా క్షేత్రమనీ, దైవ తీర్థంగా పురాణకాలం నుంచి విరాజిల్లుతోంది. పినాకిని నది ఒడ్డున సుమారు 5 వేల ఏళ్ల క్రితం ఈ క్షేత్రం వెలసినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఆలయం కొలనులో దేవకన్యలు స్నానమాచరించి... త్రిపుర సుందరీ దేవి అమ్మవారిని పూజించటం వలనే ఈ క్షేత్రానికి కన్యతీర్థం అని పేరు వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి.

  • ఆర్డీవోకు వినతి

కర్మాగార ప్రహారీని ఆలయానికి బయట నుంచి ఏర్పాటు చేయాలని కోరుతూ.. కన్యతీర్థం పాలకవర్గ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శివనాథ్​రెడ్డి, జమ్మలమడుగు ఆర్డీవో నాగన్నకు వినతిపత్రం అందజేశారు. ఆలయ ప్రాశస్త్యం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి, ప్రహారీని గుడి బయట నుంచి ఏర్పాటు చేసేలా ఆలోచించాలని కోరారు.

ఇదీ చదవండి:చిన్న వరదాయపల్లెలో నాకాబందీ

ABOUT THE AUTHOR

...view details