ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తానొక ప్రభుత్వ ఉద్యోగి అనే విషయాన్ని మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని తెదేపా రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి, కడప ఆర్టీసీ జోనల్ చైర్మన్ వెంకటసుబ్బారెడ్డి ఆరోపించారు. కడపలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన... చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోతే అధికారం కోల్పోతుందని ఎల్వీ సుబ్రహ్మణ్యం అనడం సరికాదని వారించారు. కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, ఎన్నికల కమిషనర్ మోదీ ఆధీనంలో ఉన్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినప్పటికీ చంద్రబాబు విజయాన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. తెదేపాకు 120 నుంచి 130 సీట్లు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
'సీఎస్ ప్రభుత్వ ఉద్యోగి అని మర్చిపోయారు' - subba reddy kadapa
చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోతే అధికారం కోల్పోతుందని ఎల్వీ సుబ్రహ్మణ్యం అనడం సరికాదని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కడప ఆర్టీసీ జోనల్ చైర్మన్ వెంకటసుబ్బారెడ్డి వారించారు
వెంకటసుబ్బారెడ్డి