కడప జిల్లా బద్వేల్లోని కుమ్మరి కోటాలో ఖలీల్ భాషా అనే విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానిక ఓ ప్రైవేట్ కళాశాలలో బీకాం పూర్తి చేసి.. పీజీ ప్రవేశ పరీక్ష కోసం సన్నద్ధమవుతున్నాడు. ఖలీల్భాషా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చేతికి ఎదిగొచ్చిన కొడుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారికి ఖలీల్భాషా ఒక్కడే సంతానం. అయితే తమ కుమారుడి ఆత్మహత్యకు కారణాలు తెలియదని... బయట ఏం జరిగిందోనని తల్లిదండ్రులు అంటున్నారు. తమకు పోలీసులు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని విద్యార్థి మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో విద్యార్థి బలవన్మరణం - student
చేతికి అందివచ్చిన కొడుకు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కడప జిల్లా కుమ్మరికోటలో జరిగింది. డిగ్రీ చదివిన ఒక్క కొడుకు ఆత్మహత్యకు పాల్పడటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
విద్యార్థి ఆత్మహత్య