కరోనా వేళ కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని.. రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. కడప జిల్లా వేంపల్లిలో మాట్లాడుతూ.. వైకాపా, భాజపా ప్రభుత్వాలపై మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చే బియ్యాన్ని శానిటైజర్లు తయారుచేసేలా జీవో ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణపై విజయసాయిరెడ్డి విమర్శలు చేయడంపై స్పందించారు. వాటికి భాజపా నేతలు వివరణ ఇవ్వాలన్నారు. పెద్దలు, మేధావులు, మీడియా అందరూ కరోనాపై పోరాడుతుంటే.. వైకాపా ప్రభుత్వానికి మాత్రం ఏమీ పట్టడం లేదని వ్యాఖ్యానించారు.
'కరోనాపై ప్రభుత్వానికి ఏం పట్టడం లేదు' - వైకాపా ప్రభుత్వంపై తులసిరెడ్డి విమర్శలు తాజా వార్తలు
రాష్ట్రంలో పెద్దలు, మేధావులు, మీడియా అందరూ కరోనాపై పోరాడుతుంటే.. వైకాపా ప్రభుత్వానికి మాత్రం ఏమీ పట్టడం లేదని.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు.
తులసిరెడ్డి
TAGGED:
tulasireddy fires on ycp