కమ్యూనిస్టు నేతలపై శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం - కమ్యూనిస్టు నేతలపై ప్రభుత్వ చీఫ్ విఫ్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహాం
కమ్యూనిస్టు పార్టీ నేతలు నారాయణ, రామకృష్ణపై ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలు తరలిపోతున్నాయని రామకృష్ణ దుష్ప్రచారం చేయటం తగదన్నారు. వైకాపా సెక్యులర్ పార్టీ అని ప్రతిసారి నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికలప్పుడు వైకాపాతో భాజపా అంటగట్టిందని విమర్శించిన తెదేపా నేతలు... ఆ తర్వాత దిల్లీ వెళ్లి వాళ్ల కాళ్లు పట్టుకోవడం సిగ్గుచేటు కాదా అని ప్రశ్నించారు. సుజనాచౌదరి, సీఎం రమేష్ చంద్రబాబు అనుమతి లేకుండానే భాజపాలో చేరారా అని నిలదీశారు.
కమ్యూనిస్టు నేతలపై ప్రభుత్వ ఛీఫ్ విఫ్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహాం