ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్రహ్మంగారిమఠం పీఠాధిపత్యం పరిష్కారం దిశగా ముందడుగు - బ్రహ్మంగారి మఠానికి ప్రత్యేకాధికారి వార్తలు

కొంత కాలంగా ఉన్న బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం వివాదం పరిష్కార దిశగా ముందడుగు పడింది. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి ఇవాళ మఠానికి చేరుకోనున్నారు. రెండు కుటుంబాలతో పాటు గ్రామస్థుల అభిప్రాయాలు సేకరించనున్న విచారణ అధికారి.. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ధార్మిక పరిషత్‌ ఆధ్వర్యంలో కమిటీ వేసి.. పీఠాధిపతిని ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

issue going on brahmamgari pitham
issue going on brahmamgari pitham

By

Published : Jun 26, 2021, 5:16 AM IST

బ్రహ్మంగారిమఠంలో పీఠాధిపత్యం సమస్య పరిష్కారానికి.. ప్రభుత్వం నియమించిన ప్రత్యేక విచారణ అధికారి నేడు మఠానికి చేరుకోనున్నారు. దేవదాయశాఖ జాయింట్ కమిషనర్​ చంద్రశేఖర్ ఆజాద్‌ను ప్రత్యేక విచారణ అధికారిగా ప్రభుత్వం నియమించింది. ఆయన మఠానికి చేరుకుని.. దివంగత పీఠాధిపతి వెంకటేశ్వరస్వామి పెద్ద భార్య నలుగురు కుమారులు, రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మ, ఆమె ఇద్దరు కుమారులతో సమావేశమవుతారు. వారి అభిప్రాయాలు సేకరిస్తారు. ఏకాభిప్రాయం కుదరకపోతే.. ప్రభుత్వ పరంగా ఎలాంటి నిబంధనలు అమలు చేస్తారో వారికి వివరించనున్నారు. గ్రామస్థులు, ధార్మిక సంఘాల అభిప్రాయాలనూ అధికారి సేకరిస్తారు. వీటన్నింటినీ నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేస్తారు.

ప్రత్యేక అధికారి ఇచ్చే నివేదికను అనుసరించి.. ప్రభుత్వం ధార్మిక పరిషత్‌ ఆధ్వర్యంలో మఠాధిపతులతో కమిటీ వేయనుంది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం బ్రహ్మంగారిమఠం పీఠాధిపతిని నియమించే అవకాశముంది. జులైలో పీఠాధిపతిని అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:NGT: రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణంలో ఏపీ తీరుపై ఎన్జీటీ ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details