జిల్లా ఎస్పీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది అధ్వర్యంలో గురువారం కడపలోని ఎర్రముక్కపల్లి, ఐ.టి.ఐ సర్కిల్, వినాయక నగర్, అక్కాయపల్లి, నకాష్, బి.కే.ఎం వీధి వంటి ప్రాంతాల్లో నిషేధిత గుట్కా నిల్వలపై దాడులు నిర్వహించారు.
భారీగా నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు - heavily banned gutka sized news
భారీ ఎత్తున నిషేధిత గుట్కా ప్యాకెట్ల కడప జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పది లక్షల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. తనిఖీల్లో పాల్గొన్న స్పెషల్ బ్రాంచ్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
భారీగా నిషేధిత గుట్కా స్వాధీనం
రూ.10 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను, మహీంద్రా జేనియో లగేజి వాహనం స్వాధీనం చేసుకొని ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. సిబ్బందిని జిల్లా ఎస్పీ కే.కే.ఎన్ అన్బురాజన్ అభినందించారు.
ఇవీ చూడండి...