కడపలో వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న 400 మంది పాత్రికేయులకు ఎస్పీ అన్బురాజన్ మెడికల్ కిట్, డ్రై ఫ్రూట్స్ అందజేశారు. రెండో విడత కరోనా చాలా ఉద్ధృతంగా ఉందని.. జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ సూచించారు. పాత్రికేయులు విధి నిర్వహణలో బయట తిరుగుతున్న కారణంగా మాస్కులు, శానిటైజర్, భౌతిక దూరం పాటించాలని కోరారు. మన జాగ్రత్తలో మనం ఉండాలని సూచించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకొని రావాలని ఎస్పీ తెలిపారు.
జర్నలిస్టులకు డ్రైఫ్రూట్స్, మెడికల్ కిట్లు పంపిణీ - latest news in kadapa district
జర్నలిస్టులు తమ ఆరోగ్యాలను కాపాడుకుంటూ విధులు నిర్వహించాలని కడప జిల్లా పోలీస్ అధికారి అన్బురాజన్ అన్నారు. ఈ మేరకు 400 మంది పాత్రికేయులకు ఎస్పీ.. మెడికల్ కిట్, డ్రై ఫ్రూట్స్ అందజేశారు.
ఎస్పీ అన్బురాజన్