పోలీసులు విధులతో పాటు వారి ఆరోగ్యాలపై కూడా దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీ అన్బురాజన్ పిలుపునిచ్చారు. ఇటీవల కడప జిల్లాలో వివిధ రకాల అనారోగ్య కారణాలతో మృతి చెందిన నలుగురు పోలీస్ కుటుంబాలకు ఎస్పీ ఆర్ధిక సాయం చేశారు. ఒక్కో కుటుంబానికి రెండు లక్షల రూపాయల చొప్పున ఎనిమిది లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం వారి కుటుంబాల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క పోలీస్ వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మనపై కుటుంబం ఆధారపడి ఉందన్న విషయాన్ని పోలీసులు గ్రహించాలన్న ఆయన.. పోలీసుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు.
పోలీస్ కుటుంబాలకు ఎస్పీ అన్బురాజన్ ఆర్థిక సాయం - kadapa district SP Amburajan latest news update
కడప జిల్లాలో వివిధ రకాల అనారోగ్య కారణాలతో మృతి చెందిన నలుగురు పోలీస్ కుటుంబాలకు ఎస్పీ అన్బురాజన్ ఆర్ధిక సాయం అందజేశారు. అనంతరం వారి కుటుంబాల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
పోలీస్ కుటుంబాలకు ఎస్పీ అంబురాజన్ ఆర్ధిక సాయం
TAGGED:
Sp