సిమెంట్ బస్తా విషయంలో పినతండ్రిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన కడప జిల్లా గోపవరం మండలం అడ్రసువారుపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన చంద్రాయుడు అనే వ్యక్తి.. పినతండ్రైన చెన్నయ్యతో సిమెంట్ బస్తా విషయంలో వాగ్వాదానికి దిగాడు. కోపానికి గురైన చంద్రాయుడు.. కత్తితో పినతండ్రిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన చెన్నయ్యను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సిమెంట్ బస్తా విషయంలో పినతండ్రిపై కత్తితో దాడి - అడ్రసువారుపల్లిలో నేర వార్తలు
సిమెంట్ బస్తా విషయంలో పినతండ్రిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన కడప జిల్లా గోపవరం మండలం అడ్రసువారుపల్లి గ్రామంలో జరిగింది.
పినతండ్రిపై కొడుకు కత్తితో దాడి