నైపుణ్యాభివృద్ధి నిధిగా కడప జిల్లాను తీర్చిదిద్దాలని కలెక్టర్ సి.హరికిరణ్ అన్నారు. ఆ దిశగా జిల్లాలో చదువుకున్న యువతకు ఆసక్తి గల రంగంలో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు ఉండాలన్నారు. పరిశ్రమలకు అవసరమయ్యే విధంగా యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించేలా కార్యాచరణ ప్రణాళికలు వెంటనే రూపొందించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జాయింట్ కలెక్టర్లు సీఎం సాయి కాంత్ వర్మ, పి ధర్మ చంద్రారెడ్డిలతో కలిసి జిల్లాస్థాయి నైపుణ్యాభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లావాసి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చినప్పటి నుంచి జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెరుగుతోందని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసుకుని పనులు ప్రగతిలో ఉన్నాయన్నారు.