పాఠశాలలు ఆగస్టులో తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి. లాక్డౌన్, వేసవి విరామంలో కారణంగా బడుల్లో నాడు-నేడు అభివృద్ధి పనులు చేస్తున్నారు. నాడు-నేడు పనులు కడప జిల్లాలో శరవేగంగా జరుగుతున్నాయి. తొలిదశ పనులు జులై 15 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు.
కడప జిల్లాలో 1040 ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు కింద మరమ్మతులు చేస్తున్నారు. పాఠశాలల్లో తరగతి గదులకు మైనర్, మేజర్ రిపేర్లు, ప్రహరీగోడ, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం వంటి పనులు చేస్తున్నారు. జిల్లాలోని 1040 పాఠశాలల్లో 7409 పనులు జరుగుతున్నాయి. ఈ పనులకు రూ.195 కోట్ల నిధులు మంజూరయ్యాయి. 2328 పనులు పురోగతిలో ఉండగా... ఇప్పటివరకు రూ.28 కోట్లు ఖర్చుచేశారు.
నాడు-నేడు పనులు చేస్తున్న పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీ సమక్షంలో రోజువారీ పర్యవేక్షణ చేయాల్సిరావడం ఇబ్బందిగా మారిందని ప్రధానోపాధ్యాయులు అంటున్నారు. ఇంజినీర్లు అంచనా వేసిచ్చిన పనులను ఉపాధ్యాయులే... కావాల్సిన మెటిరియల్ దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. స్టీల్, కంకర, ఇతర సామగ్రి కొనుగోలు చేయడంతో పాటు... రోజూ జరిగిన పనులపై ఫొటోలు తీసి... సాయంత్రానికి మన బడి నాడు-నేడు వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.
అవగాహన లేకపోవడం...