పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కడప జిల్లా మైదుకూరు పురపాలక కార్మికులు విధులు బహిష్కరించి, పురపాలక కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. గత కొద్ది రోజులుగా వేతనాలు చెల్లించాలని అధికారులును వేడుకున్నా వారు స్పందించకపోవటంతో ధర్నా చేపట్టవలసి వచ్చిందని యూనియన్ నాయకులు తెలిపారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సమ్మెలో పాల్గొన్న ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియ్ గౌరవాధ్యక్షుడు శ్రీరాములు మాట్లాడుతూ వేతన బకాయిలు వెంటనే చెల్లించకపోతే విధులకు హాజరుకామంటూ వ్యాఖ్యానించారు. సరిగ్గా జీతాలు అందక కార్మికులు రోడ్డున పడతున్నారనీ, వెంటనే అధికారలు స్పందించి బకాయి పడిన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేబర్ యాక్ట్ ప్రకారం జీతాలు చెల్లిచకపోతే సంబంధిత అధికారులపై పోలీసు కేసులు పెట్టవచ్చునని ఆయన అన్నారు.