కడప జిల్లా రాజంపేట ఆర్టీసీ డిపో ఎదుట ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జీవీ నరసయ్య మాట్లాడారు. ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేయడం వల్ల తమ సమస్యలన్నీ తీరిపోతాయని భావించామన్నారు. కానీ ప్రభుత్వంలోకి విలీనమైన తర్వాత అన్ని సౌకర్యాలను కల్పించాల్సిన యాజమాన్యం ఇప్పుడున్న సౌకర్యాలను తొలగిస్తూ జీవోలు జారీ చేయడం దారుణమన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చే గుర్తింపు కార్డులు, బస్సు పాసులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రతి కార్మికుడి వేతనం నుంచి నెలనెలా రూ.250 కట్ చేసి.... పదవీ విరమణ తర్వాత ఆ మొత్తాన్ని ఫించన్ రూపంలో ఇచ్చేవారన్నారు. ఇప్పుడు ఆ పథకాన్ని రద్దు చేశారన్నారు. ఇలా సౌకర్యాలన్నిటినీ తొలగిస్తూ కార్మికులను అభద్రతాభావంలోకి నెడుతున్నారంటూ వాపోయారు. ఇలాగే కొనసాగితే ఆందోళన తీవ్రం చేస్తామంటూ హెచ్చరించారు.
'ఆర్టీసీ కార్మికులకు ఉన్న సౌకర్యాలను తొలగించటం దారుణం' - రాజంపేటలో ఆర్టీసీ కార్మికుల ధర్నా న్యూస్
ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేయడం వల్ల తమ సమస్యలన్నీ తీరిపోతాయని భావించామని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జీవీ నరసయ్య అన్నారు. కానీ ప్రభుత్వంలోకి విలీనమయ్యాక ఆర్టీసీ యాజమాన్యం అనుసరిస్తున్న విధానంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
రాజంపేటలో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకుల ఆందోళన