ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడపలో రూ.3కోట్లు విలువైన ఎర్రచందనం దుంగలు పట్టివేత - కడప జిల్లా బోటుమీదపల్లె వద్ద ఎర్రచందనం దుంగలు స్వాధీనం

కడప జిల్లా పుల్లంపేట మండలం బోటుమీదపల్లె వద్ద.. రూ.3 కోట్లు విలువ చేసే ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుంగలను తరలిస్తున్నారనే సమాచారంతో.. పోలీసులు తనీఖీలు నిర్వహించగా 129 దుంగలు పట్టుబడ్డాయి.

rs.3 crores worthy red sandal logs seized in kadapa district
ఎర్రచందనం దుంగలు

By

Published : Mar 31, 2021, 8:32 AM IST

Updated : Mar 31, 2021, 12:08 PM IST

కడప జిల్లాలో భారీగా ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. పుల్లంపేట మండలం బోటుమీదపల్లె వద్ద ఘటన ఎర్రచందనం తరలిస్తున్నారనే సమాచారంతో.. పోలీసుల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా.. 30 మంది ఎర్రచందనం కూలీలు లారీ కంటైనర్​లో ఖాళీ అట్టపెట్టెల మాటున తరలిస్తున్న 129 దుంగలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, అటవీ అధికారులను చూసి.. కూలీలు పరారైనట్లు.. డివిజినల్ ఫారెస్ట్ అధికారి ధర్మరాజు తెలిపారు. దుంగల విలువ రూ.3 కోట్లు ఉంటుందని డివిజినల్ ఫారెస్ట్ అధికారి ధర్మరాజు తెలిపారు. ఎవరైనా అక్రమ ఎర్రచందనం రవాణాకు పాల్పడితే ఫారెస్ట్ అధికారులకు తెలియజేయాలని వారు కోరారు. పెద్ద మొత్తంలో ఎర్ర చందనాన్ని పట్టుకున్న రైల్వేకోడూరు ఫారెస్ట్ రేంజ్ అధికారి నయీమ్ అలీ బృందాన్ని అభినందించారు.

Last Updated : Mar 31, 2021, 12:08 PM IST

ABOUT THE AUTHOR

...view details