కడప జిల్లా ప్రొద్దుటూరు రైల్వే గేట్ సమీపంలోని బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని కారు వేగంగా ఢీకొట్టింది. ఘటనలో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న యువతీ, యువకుడు ఎగిరి కింది పడ్డారు. యువతికి ఒక చేయి తెగి పడింది. వారిద్దరూ అక్కడికక్కడే మృత్యు వాత పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన వారి వివరాలను సేకరిస్తున్నారు. మృతులు ఏ ప్రాంతానికి చెందిన వారు, ఎక్కడి నుంచి వస్తున్నారనే వివరాలపై ఆరా తీస్తున్నారు.
ప్రొద్దుటూరులో బైక్ ఢీకొన్న కారు... ఇద్దరు మృతి - road accident news in kadapa
ద్విచక్రవాహనాన్ని వేగంగా కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరు రైల్వేగేట్ సమీపంలో జరిగింది.ఘటపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రొద్దుటూరులో బైక్ ఢీకొన్న కారు... ఇద్దరు మృతి