ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

28న ఆర్జీయూకేటీ ప్రవేశ పరీక్ష

ఆర్జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్‌ ఐటీల్లో 2020-21 ప్రవేశాల కోసం వంద మార్కులకు బహుళైచ్ఛిక విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. ఈనెల 28న ఉదయం 11 నుంచి ఒంటిగంట వరకు ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో 638 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు.

RGUKT EXAM
RGUKT EXAM

By

Published : Nov 23, 2020, 7:14 AM IST

రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీల్లో 2020-21 ప్రవేశాల కోసం వంద మార్కులకు బహుళైచ్ఛిక విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు.

గణితం, సైన్సు పాఠ్యాంశాలపై పరీక్ష ఉంటుంది. ఆరేళ్ల సమీకృత ఇంజనీరింగ్‌ విద్య, గుంటూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, తిరుపతి శ్రీవేంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెంలోని డాక్టర్‌ వైఎస్సార్‌ హార్టికల్చర్‌ విశ్వవిద్యాలయంలో రెండు లేదా మూడేళ్ల డిప్లొమా కోర్సులు చదువుకునేందుకు ఈనెల 28న ఉదయం 11 నుంచి ఒంటిగంట వరకు ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. పరీక్ష కోసం తెలుగు రాష్ట్రాలకు చెందిన 88,972 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 638 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. వెబ్‌సైట్‌ (http://rguktcet.in ) లో హాల్‌టిక్కెట్లను, ఇతర వివరాలను ఉంచామని ఆర్జీయూకేటీ కులపతి ఆచార్య కేసీరెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:'న్యాయమూర్తులపై పోస్టుల వ్యవహారంలో కుట్ర కోణం ఉందా?'

ABOUT THE AUTHOR

...view details