ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప జిల్లాలో ఎర్రచందనం పట్టివేత: స్మగ్లర్ అరెస్ట్ - REDSANDAL

కడపజిల్లాలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. చెన్నూరు మండలం కైలాసగిరి అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్ నాసిల్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనితోపాటు మరో ముగ్గురు నిందితులు కలిసి తరచూ ఎర్రచందం తరలించేవారని పోలీసు విచారణలో వెల్లడైంది. ముగ్గురు నిందితులు పరారీలో ఉండగా... చాపాడు మండలానికి చెందిన నాసిల్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇతని వద్ద నుంచి 28 లక్షల రూపాయల విలువ చేసే ఎర్రచందనం దుంగలు, 40 వేల రూపాయల నగదు, నాలుగు వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు కడప డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. వీరంతా ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలించడమే కాకుండా... ఇళ్లలో దోపిడీలు కూడా చేస్తున్నారని డీఎస్పీ చెప్పారు. వీరిపై ఎర్రచందనం కేసులతోపాటు ఇళ్లలో చోరీలు చేసిన కేసులు ఉన్నాయని వెల్లడించారు.

REDSANDALS SMUGGLER ARREST AT KAILASAGIRI FOREST AREA IN KADAPA DISTRICT
కడప జిల్లాలో ఎర్రచందనం పట్టివేత

By

Published : Feb 19, 2020, 11:34 PM IST

.

కడప జిల్లాలో ఎర్రచందనం పట్టివేత

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details