ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండున్నర నెలల్లో.. 200కు పైగా ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్! - కడపలో ఎర్రచందనం అక్రమ రవాణా

ప్రపంచంలోనే అరుదైన, విలువైన ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు..కడప జిల్లా పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అక్రమ రవాణాకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలను గుర్తించిన పోలీసులు..ఆయా ప్రాంతాల్లో ముమ్మరంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ప్రత్యేక బృందాలుగా విడిపోయి అడవిని జల్లెడ పడుతున్నారు. గత రెండున్నర కాలంలో సుమారు 200 పైగా స్మగ్లర్లను అరెస్టు చేసి... భారీ మొత్తంలో దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

Red sandal
Red sandal

By

Published : Jan 25, 2021, 10:09 AM IST

ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీసుల చర్యలు

కడప జిల్లాలో కడప, రాజంపేట, ప్రొద్దుటూరు అటవీ రేంజ్‌ పరిధిలో...దాదాపు 3.5 లక్షల హెక్టార్లలో ఎర్రచందనం విస్తరించింది. ఇదంతా సువిశాలమైన అటవీ ప్రాంతం కావడంతో స్మగ్లర్లు...తమిళనాడుకు చెందిన కూలీల చేత చెట్లను నరికించి...రహస్యంగా తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల మీదుగా విదేశాలకు తరలిస్తూ కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. ఈ అక్రమ రవాణాను అరికట్టేందుకు కడప జిల్లా పోలీసులు ఒక్కసారిగా దూకుడు పెంచారు.

ప్రధానంగా కడప, రాజంపేట, ప్రొద్దుటూరు అటవీ రేంజ్‌ పరిధిలో...స్మగ్లింగ్‌ ఎక్కువగా జరుగుతుందని గుర్తించిన పోలీసులు...ఆయా ప్రాంతాల్లో నిఘా పెంచారు. కూంబింగ్‌ ఆపరేషన్‌లో ఆరితేరిన స్పెషల్‌ పార్టీ పోలీసులు జిల్లాలో 120 మంది వరకు ఉన్నారు. వీరితో పాటు ఒక్కో స్పెషల్‌ పార్టీ బృందంలో పది నుంచి 12 మంది చొప్పున ఉండే మరో 10 బృందాలు నిరంతరం అడవిని గాలిస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలతో పాటు కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లను..200 మందికి పైగానే రెండున్నర నెలల కాలంలో అరెస్ట్ చేశారు.

కరోనా కారణంగా కొన్నాళ్లు కూంబింగ్‌ను నిలిపేసిన పోలీసులు...ఎర్రచందనం స్మగ్లర్ల కోసం మళ్లీ అడవిని జల్లెడ పడుతున్నారు. కూంబింగ్‌ బలగాల సంఖ్యను మరింత పెంచుతామంటున్న అధికారులు..ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకుని తీరతామని స్పష్టంచేస్తున్నారు.

ఇదీ చదవండి:కంటికి రెప్పలా కాపాడాల్సినవారే కాటేశారు

ABOUT THE AUTHOR

...view details