రాజంపేటకు చేరుకున్నరామరాజ్య రథయాత్ర శ్రీ రామదాస మిషన్ యూనివర్సల్ ఆధ్వర్యంలో రామమందిరం నిర్మాణమే లక్ష్యంగా చేస్తున్న రామ రాజ రథయాత్ర కడప జిల్లా రాజంపేటకు చేరుకుంది. ఈనెల 4న మహాశివరాత్రి సందర్భంగా తమిళనాడులోని రామేశ్వరంలో యాత్ర మొదలైంది. ఈ బృందం రాజంపేటకు చేరిన సందర్భంగా...పాత బస్టాండునుంచి సరస్వతీ విద్యా మందిరం విద్యార్థులు కోలాటం చేస్తూ రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వరకు చేరుకున్నారు. భారతదేశంలో సెలవు దినంగా ఆదివారం ప్రకటించారని.. ఆ విధానాన్ని మార్చాలని మిషన్ ప్రతినిధులు చెప్పారు. వారాంతపు సెలవునుగురువారంగా మార్చాలని డిమాండ్ చేశారు.