కడపజిల్లా ఎర్రగుంట్ల మండలం కలమల్లలో అమానవీయమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నెల 5వ తేదీన మేకలను మేపుకోవడానికి మైనర్ బయటకు వెళ్లింది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన 60 ఏళ్ల వ్యక్తి... ఆ బాలికపై అత్యాచారానికి యత్నించాడు.అప్పటినుంచి మేకలను బయటకు తీసుకెళ్లి మేపనని ఆమె తల్లిదండ్రులతో చెప్పింది. ఏమైందని ఆరా తీయగా... జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. కొందరు గ్రామస్తులు ఈ విషయం బయటకు రాకుండా పంచాయతీ చేసి కొంత సొమ్ముతో ఒప్పందం కుదుర్చారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ... తన మహిళ సిబ్బందిని గ్రామానికి పంపాడు. కేసు పెట్టడానికి ముందుకు ఎవరూ రాకపోవడం వల్ల పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.
మైనర్పై 60ఏళ్ల వ్యక్తి అత్యాచారం - కడపలో బాలికలపై అత్యాచారాలు
మనవరాలు లాంటి వయసున్నఓ బాలికపై 60 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన కడప జిల్లా కలమల్లలో జరిగింది.
కడపలో మైనర్పై అత్యాచారం