సీఎం జగన్ సమక్షంలో.. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైకాపా గూటికి చేరారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రామసుబ్బారెడ్డి.. ఆయన అనుచరులతో ముఖ్యమంత్రిని కలిశారు. సీఎం జగన్... వైకాపా కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతానని రామసుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. భయపడి కానీ, ఒత్తిళ్లకు తలొగ్గి కానీ వైకాపాలో చేరటం లేదని స్పష్టం చేశారు. స్వచ్ఛందంగానే పార్టీ మారినట్లు చెప్పారు.
వైకాపా గూటికి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి - వైకాపాలోకి మాజీమంత్రి రామసుబ్బారెడ్డి
మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి.. వైకాపా గూటికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
వైకాపా తీర్థం పుచ్చుకున్న మాజీమంత్రి రామసుబ్బారెడ్డి