కడప జిల్లా పెద్ద ముడియం మండలం పెద్దపసుపుల గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం పెద్దపసుపుల గ్రామంలోని ఓ గోదాము వద్ద .....బ్యాంకర్లు సరకును తీసుకెళ్లేందుకు వచ్చారు. శనగ పంట పైన రుణాలు ఇచ్చి.. ఏడాది దాటినా తిరిగి చెల్లించలేదని అందుకే జప్తు చేస్తున్నామన్నారు. అందుకు రైతులు ససేమిరా ఒప్పుకోలేదు. అక్కడకు చేరుకున్న జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. బ్యాంకర్లతో మాట్లాడి కొంత గడువుని కోరారు. కనీసం మూడు నెలలైనా గడువు ఇస్తే రైతులు రుణాలు చెల్లించే అవకాశం ఉందని చెప్పడంతో వెనుదిరిగారు.
బ్యాంకర్ల తీరుపై.. పెద్దపసుపుల రైతుల ఆందోళన
శనగ పంటపై రుణాలు ఇచ్చి... ఏడాది దాటినా తిరిగి చెల్లించలేదన్న కారణంగా... కడప జిల్లా పెద్దపసుపుల గ్రామంలో బ్యాంకర్లు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. సరుకు తీసుకెళ్లేందుకు వెళ్లిన వారి తీరుపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.
కడప జిల్లాలో రైతులు ఆందోళన