కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ అధికారులు దాడులు చేశారు. జిల్లా ఎస్పీ చక్రవర్తి ఆదేశాల మేరకు పట్టణ ఎస్ఈబీ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ తమ సిబ్బందితో కలిసి తనిఖీలు జరిపారు. గత రెండు రోజులుగా చేసిన దాడుల్లో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 10 లీటర్ల నాటుసారా, 11 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు.
నాటుసారా స్థావరాలపై రైల్వేకోడూరు ఎస్ఈబీ అధికారులు దాడులు - illegal liquor caught in railway kopduru mandal
రైల్వేకోడూరు మండలంలో నాటుసారా స్థావరాలపై పట్టణ ఎస్ఈబీ అధికారులు దాడులు చేశారు. రెండు రోజుల పాటు చేసిన దాడుల్లో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
తనిఖీల్లో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్