కడప జిల్లా రాయచోటి ఏరియా ఆసుపత్రికి నూతన అభివృద్ధి కమిటీ ఏర్పాటైంది. బుధవారం ఆసుపత్రి ఆవరణంలో కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గా ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆసుపత్రి అభివృద్ధికి మరింత కృషి చేస్తామని ఆయన తెలిపారు.
చుట్టుపక్కల 9 మండలాల ప్రజలకు దేవాలయంలా... రాయచోటి ప్రభుత్వాసుపత్రి కొనసాగుతోందన్నారు. 50 పడకల ఆసుపత్రి స్థాయి నుంచి 100 పడకల ఆసుపత్రి స్థాయికి పెంచిన సీఎం జగన్కు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రూ.23 కోట్ల నిధులతో చేపట్టిన భవనాల నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
నిధులు దుర్వినియోగం కాకుండా పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. వైద్యాధికారులు, సిబ్బంది రాత్రి వేళల్లో రోగులకు అందుబాటులో ఉండి... సేవలు అందించాలని ఆయన ఆదేశించారు.